'స్వాగ్' విషయంలో బాధపడలేదు: శ్రీవిష్ణు

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం '#సింగిల్'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన గత చిత్రం 'స్వాగ్' రిజల్ట్ గురించి స్పందించాడు. 'స్వాగ్' విషయంలో తాను ఏమాత్రం బాధపడలేదని తెలిపాడు. ఆ సినిమాతో తనకెంతో గుర్తింపు, పేరు వచ్చిందని చెప్పాడు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసినా అంత పేరు రాదేమోనని వెల్లడించాడు.