ఇ -నామ్ యొక్క పాత్రపై రైతులకు అవగాహన
SRCL: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కరీంనగర్ ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ మండలంలోని హన్మాజిపేట గ్రామంలో వ్యవసాయ శాఖ రూరల్ తో కలిసి ఇ-నామ్ యొక్క పాత్రపై రైతు అవగాహన, వరి విత్తనోత్పత్తి క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇ-నామ్ వ్యవసాయ మార్కెటింగ్‌లో విప్లవాత్మక మార్పు తెస్తుందని శాస్త్రవేత్త డా.కె.మదన్ మోహన్ రెడ్డి తెలిపారు.