భారత యువ షూటర్ల మెరుపులు

కజకిస్తాన్‌లో జరిగిన 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్లు సత్తా చాటారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల యూత్ ఈవెంట్‌లో గిరీష్ గుప్తా 241.3 పాయింట్లు సాధించి స్వర్ణం సాధించాడు. అదే ఈవెంట్‌లో 238.6 పాయింట్లు సాధించిన మరో భారత యువ షూటర్ దేవ్ ప్రతాప్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు.