‘IAF శిక్షణతోనే అంతరిక్షయానం సాధ్యమైంది’

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన అంతరిక్ష యానానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) నేర్పిన మెలకువలే కారణమని పేర్కొన్నారు. తన గురువులు IAF, కాక్‌పిట్ మాత్రమేనని తెలిపారు. భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న గగన్‌యాన్ ప్రాజెక్టుపై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. అంతరిక్షం నుంచి భారతదేశం ఎంతో అందంగా కనిపిస్తుందని శుక్లా తెలిపారు.