VIDEO: ఏడాదిగా సమస్య.. 25 కుటుంబాల ఆవేదన
KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో కల్వర్టు కూలిపోయే దశలో ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిగా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 25 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, వెంటనే స్పందించాలని స్థానికుడు జగన్మోహన్ రెడ్డి కోరారు. సమస్యను పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేస్తామన్నారు.