ప్రతిపక్ష సీఎంలు చేసిన తప్పేంటి?: కాంగ్రెస్

ఈనెల 25న ఎన్డీయే ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ కానున్నట్లు సమాచారం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష ముఖ్యమంత్రులను ఎందుకు ఆహ్వానించలేదని, వారు చేసిన తప్పేంటని జైరాం రమేశ్ ప్రశ్నించారు. 'ఆపరేషన్ సింధూర్'ను రాజకీయం చేయడం తగదని వ్యాఖ్యానించారు.