వెంకటపాలెంలో రైతుల సంబరాలు
GNTR: అమరావతికి చట్టబద్ధత బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న సందర్భంగా వెంకటపాలెం గ్రామంలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. మహిళలు మిఠాయిలు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలు బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇవాళ లోక్ సభలో అమరావతికి చట్టబద్ధత వచ్చిన విషయం తెలిసిందే.