VIDEO: శ్రీశైలం ఉత్సవాలు.. భృంగి వాహనంపై ఆది దంపతులు
NDL: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు శ్రీస్వామి, భ్రమరాంబికాదేవి మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపంలో ప్రత్యేక పూజలు అందుకున్న ఉత్సవమూర్తులకు వైభవంగా గ్రామోత్సవాన్ని జరిపించారు. గ్రామోత్సవం ముందు వివిధ కళారూపాల ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది.