ఉరితాళ్లతో నిరసన

విశాఖలో లిటిల్ ఏంజెల్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న 15 మంది ఉద్యోగులను తొలగించడం దుర్మార్గమని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మెడకు ఉరితాళ్లు కట్టుకుని ధర్నా చేశారు. అన్యాయంగా తొలగించిన 15 మందిని తక్షణమే వీధిలోకి తీసుకోవాలని, లేబర్ కమిషనర్ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.