ఈనెల 7న పాలస్తీనా సంఘీభావ ర్యాలీకి సీపీఎం మద్దతు

KMM: ఏళ్లుగా ఇజ్రాయిల్.. పాలస్తీనాపై చేస్తున్న అమానవీయ దాడులను వెంటనే నిలిపివేయాలని CPM కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం కోరారు. సోమవారం ఖమ్మం సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 7న ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న పాలస్తీనా సంఘీభావ ర్యాలీకి CPM మద్దతు తెలుపుతోందన్నారు.