క్రీడాకారులను అభినందించిన కలెక్టర్
GDWL: జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సీఎం కప్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులను మంగళవారం అభినందించారు. జూడోలో 66 కేజీల విభాగంలో బంగారు పతకం, 46 కేజీ విభాగంలో రజత పథకం, పురుషుల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు.