సహాయ నిధి చెక్‌ను అందజేసిన కలెక్టర్
AKP: ప్రభుత్వ సహాయ నిధి చెక్‌ను కలెక్టర్ విజయ క్రిష్ణన్ బాదితులకు అందజేశారు. అనకాపల్లిలోని జగన్నాథపురాని చెందిన మువ్వల ప్రసాద్ విశాఖ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తూ 2020 ఆగష్టు 20న మరణించాడు. ప్రభుత్వ ఆకస్మిక సహాయ నిధి క్రింద 5లక్షల చెక్కును మువ్వల చిన్నకు సోమవారం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, DRO సత్యనారాయణ చేతులు మీదగా అందచేశారు.