నక్కపల్లి మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు 14న భూమి పూజ
అనకాపల్లి: నక్కపల్లి మండలంలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టిల్ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్‌కు ఈనెల 14న భూమి పూజ జరగనుంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపడుతుంది. నక్కపల్లిలో దాదాపు 2,160 ఎకరాలలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయించింది. రూ 1.47 లక్షల కోట్లతో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కానుంది.