వసంత పంచమి వేడుకలకు ముథోల్ ఎమ్మెల్యేకు ఆహ్వానం
నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు ఈ నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆలయ ఈఓ అంజనీ దేవి, వేద పండితులు ఉత్సవ ఆహ్వాన పత్రికను ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అందజేశారు. వసంత పంచమి వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.