ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

MDK: తూప్రాన్ మండలం యావపూర్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు రామని రఘువంశీ మాదిగ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జ్యోతిరావు పూలే చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు చెట్లపల్లి నవీన్ మాదిగ, అంబేద్కర్ సంఘం, దండోరా సంఘం నాయకులు పాల్గొన్నారు.