ప్రజా సమస్యలను స్వీకరించిన మంత్రి పార్థసారథి

ELR: నూజివీడులోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. రోడ్డు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు విజ్ఞప్తి చేయగా, సంబంధిత అధికారులను పిలిచి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ ప్రజలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.