అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

కడప: కలసపాడులోని గిద్దలూరు ప్రధాన రహదారిలో గురువారం తెలుగుగంగ ప్రధాన ఎడమ కాలువ వద్ద కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పది అడుగుల లోతు ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ఉన్న నాగిరెడ్డి అనే వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. అతడిని చికిత్స కోసం కలసపాడులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.