మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరం

మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరం

HNK: వాహనదారులు మద్యం తాగి వాహనం నడపటం ప్రమాదకరమని ఇంతేజార్ గంజ్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకై పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎస్సై ఆధ్వర్యంలో గురువారం వరంగల్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.