'మరిన్ని కంపెనీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి'

అనంతపురం : ఎలైట్ బయోటెక్నాలజీస్ లాంటి కంపెనీలు మరిన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం రాప్తాడు మండలంలోని గొందిరెడ్డిపల్లి వద్దనున్న ఎంఎస్ఎంఈ పార్క్‌లో ఏర్పాటుచేసిన ఎలైట్ బయోటెక్నాలజీస్ కంపెనీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.