తండాలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం
RR: కేశంపేట మండలం నిడుదవెల్లి గ్రామపంచాయతీ శ్యామ్ రావు తండాలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు పడ్డాయి. తండాకు కొత్త విద్యుత్ లైన్ పనులకు గ్రామ సర్పంచ్ భాస్కర్ గౌడ్ శనివారం శ్రీకారం చుట్టారు. లైన్ ఏర్పాటుతో తండాలో విద్యుత్ సమస్య పరిష్కారం సాధించబడనుండటంతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు తండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు.