గుణదలలో భారీగా హవాలా నగదు సీజ్

గుణదలలో భారీగా హవాలా నగదు సీజ్

NTR: విజయవాడ గుణదలలో పోలీసులు భారీ హవాలా రాకెట్‌ను ఛేదించారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 2 కోట్లకు పైగా నగదును తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న కారును సోదా చేయగా ఈ భారీ మొత్తం బయటపడింది. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడ్డ నగదును ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులకు అప్పగించారు.