అస్వస్థతకు గురైన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు
ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట్ మండలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో శుక్రవారం ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మొదట మండల PHCకి విద్యార్థులను తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం108 అంబులెన్సులో కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది.