VIDEO: సూపర్ వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం
ATP: అనంతపురంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ KSR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. హాస్టల్ వార్డెన్ క్రమశిక్షణ ఉల్లంఘనపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని తెలపడంతో నలుగురు అమ్మాయిలు సూపర్ వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కళాశాల యజమాన్యం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.