చిట్యాలలో.. బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు

చిట్యాలలో.. బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు

NLG: హైదరాబాద్‌లోని సీఐడీ హెడ్ ఆఫీస్ ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో, చిట్యాల పోలీసులు ఆ పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఇందులో భాగంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, ఆగు అశోక్, బొలుగూరి సైదులు, ఆవుల ఆనంద్, దగ్గుల సైదులు, వెంకన్న, నవీన్ రెడ్డిలను పోలీసులు స్టేషన్ కు తరలించారు.