40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

అక్రమ బొగ్గు మైనింగ్‌కు సంబంధించి పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 40 ప్రదేశాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బెంగాల్‌లో 24, జార్ఖండ్‌లో 18 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. భారీ ఎత్తున బొగ్గు మాయం అయిన కారణంగా ప్రభుత్వానికి సుమారు వందల కోట్లల్లో నష్టం జరిగిందని అందుకే తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.