బాసర క్షేత్రంలో కార్తీక శోభ
NRML: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ బాసర సరస్వతి ఆలయం కార్తీక శోభను సంతరించుకుంది. సోమవారం వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గోదావరి నది వద్ద కార్తీక స్నానాలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజ కార్యక్రమాలు నిర్వహించారు.