అనర్హత వేటు భయం ఉన్నా... తగ్గని కడియం

అనర్హత వేటు భయం ఉన్నా... తగ్గని కడియం

JN: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరడంతో, ఆయనపై ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల అనర్హత కేసు పెండింగ్‌లో ఉంది. అయినా సరే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పట్టు నిరూపించుకోవడానికి ఆయన భారీ నజరానాలు ప్రకటించారు.