రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి: సీఐ
MHBD: బయ్యారం మండల కేంద్రంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ.. విద్యతోనే వివక్షతను జయించవచ్చని అంబేద్కర్ నిరూపించారని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన సమానత్వమే నేటి స్వేచ్ఛకు పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపతి, ప్రజాప్రతినిధులు పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు.