ముస్లిం భక్తుడి రామభక్తి.. 14 ఎకరాల్లో అయోధ్య సెట్
సత్యసాయి: తనకల్లు మండలం పెద్దపల్లి గ్రామంలో మతసామరస్యం వెల్లి విరిసింది. ముస్లిం భక్తుడు ముక్తియార్ బాషా తన గ్రామంలో సుమారు 14 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అయోధ్య రామాలయ నమూనా సెట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీ రామనవమి పర్వదినం నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు వేద పండితులతో ప్రత్యేక పూజలు, భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.