ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్‌

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  ప్రజా దర్బార్‌

కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్‌ జరిగింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును ప్రజలు, అధికారులు, కార్యకర్తలు కలుసుకుని తమ సమస్యలు వివరించారు. కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపగా, మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులకు సూచించి త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.