కేసముద్రం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

MHBD: కేసముద్రం మండలంలోని పలు గ్రామాల్లో నేడు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పర్యటించారు. గురుకుల ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.