'CPS రద్దు మహాధర్నాను విజయవంతం చేయాలి'

'CPS రద్దు మహాధర్నాను విజయవంతం చేయాలి'

MDK: సీపీఎస్ రద్దు కోసం సెప్టెంబర్ 1న జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఎల్. మల్లారెడ్డి పిలుపునిచ్చారు. హవేలీ ఘనపూర్ మండల వనరుల కేంద్రంలో ఎంఈవో నాచారం మధుమోహన్ ధర్నాకు వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధ్యులు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.