నేడు ఒంటిమిట్టకు టీటీడీ జేఈవో రాక
KDP: ఈనెల 18 నుంచి 28వ వరకు ఒంటిమిట్ట మండలం దేవుని కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి వల్లూరు వీరబ్రహ్మం శనివారం ఒంటిమిట్ట రానున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.