నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏ. ఈ ఎస్.ఎస్ రావు శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. 33 KV అక్కపల్లి ఫీడర్లో లైన్ల మరమ్మత్తుల కారణంగా మోక్షగుండం సబ్‌స్టెషన్ పరిధిలో ఉన్న గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.