రాజవొమ్మంగిలో నేడు ఎమ్మెల్యే శిరీష దేవి 'ప్రజాదర్బార్'
అరకు: రాజవొమ్మంగి మండల ప్రజల సమస్యల పరిష్కారం కోసం వట్టిగడ్డ గ్రామంలో ఇవాళ ఎమ్మెల్యే శిరీష దేవి 'ప్రజాదర్బార్' నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా పాల్గొని, తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చని క్యాంపు కార్యాలయం తెలిపింది. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.