VIDEO: ఆశాపురా ఫ్యాక్టరీ వద్ద ప్రమాదకర మలుపు
VKB: ధరూర్ నుంచి తాండూరు వెళ్లే రహదారిలో ఆశాపుర ఫ్యాక్టరీ దగ్గర ప్రమాదకరమైన మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు రాత్రి సమయాల్లో మలుపుల తీవ్రతను గుర్తించలేక నియంత్రణ కోల్పోతున్నారు. అధికారులు స్పందించి సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.