కుక్కల దాడిలో చిన్నారి మృతి

NDL: బనగానపల్లె మండలం కైపగ్రామంలో శుక్రవారం కుక్కల దాడిలో చిన్నారి మధుప్రియ మృతి చెందింది. గ్రామంలో మధుప్రియ ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో మధుప్రియకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక మధుప్రియ మృత్యువాత పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.