అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్పెషల్
భారత గడ్డపై ఎందరో వీరనారిలు తమ ధైర్యసాహసాలతో చరిత్రను తిరగరాశారు. ఆంగ్లేయులను గడగడలాడించిన ఝాన్సీ లక్ష్మీబాయి, కాకతీయ సామ్రాజ్య ధీరవనిత రుద్రమదేవి, చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే నుంచి అంతరిక్షానికి ఎగిసిన కల్పనా చావ్లా వరకు ప్రతి మహిళా ఒక స్ఫూర్తి ప్రదాతే. నేటి క్రీడాకారిణులు, నటీమణులు కూడా వివిధ రంగాల్లో రాణిస్తూ దేశ గౌరవాన్ని పెంచుతున్నారు.