అనూష మృతిపై విచారణ జరపాలి.. ప్రజాసంఘాల డిమాండ్
VKB: గిరిజన బాలిక అనూష మృతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల నాయకులు వికారాబాద్ జిల్లా బాలల సంక్షేమ సమితి అధికారికి వినతిపత్రం అందజేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, త్వరలోనే నవాబుపేటలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాలని కోరారు.