ఎన్నికల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందికి పలు సూచనలు

ఎన్నికల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందికి పలు సూచనలు

KMM: గురువారం జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విధులకు హాజరయ్యే పోలీసు సిబ్బందికి ఇవాళ మధిరలో ప్రత్యేక బ్రీఫింగ్‌ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైరా ఇన్‌ఛార్జ్ ఏసీపీ వసుంధర యాదవ్ అధికారులు కట్టుదిట్టంగా పని చేయాలని సూచించారు. ఎన్నికలు శాంతియుతంగా సాగేందుకు ప్రతి పోలీసు అధికారి తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలని ఆమె ఆదేశించారు.