గుడుంబా మత్తు... జీవితాలు చిత్తు..!

గుడుంబా మత్తు... జీవితాలు చిత్తు..!

MHBD: తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాల్లో గుడుంబా వ్యాపారాన్ని మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుడుంబా పై ఉక్కుపాదం మోపాల్సిన అధికారుల అలసత్వం మాత్రం గుడుంబా తయారీదారులకు వరంలా మారింది. గుడుంబాకు బానిసైనా చాలా మంది ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ఇంట్లో వస్తువులను సైతం మాయం చేసి గుడుంబా దుకాణాల్లో దర్శనమిస్తున్నారు.