ఈషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
HYD: కైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి ఈషా సింగ్ కాంస్య పతకం సాధించారు. ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభకనబరిచారన్నారు. షూటింగ్‌లో పట్టుదలతో సాధన చేస్తున్న ఈషా సింగ్ ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు.