వినుకొండ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఘర్షణ

వినుకొండ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఘర్షణ

PLD: వినుకొండలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పొలం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల విచారణ అనంతరం బయటకు వచ్చిన రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ దాడిలో శివమాల ధరించిన వ్యక్తికి గాయాలవ్వగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరొకరికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.