అడివి శేష్ ‘డెకాయిట్’ మాస్ లుక్

అడివి శేష్ ‘డెకాయిట్’ మాస్ లుక్

షనీల్ డియో దర్శకత్వంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తోన్న చిత్రం ‘డెకాయిట్’. తాజాగా విడుదలైన పోస్టర్‌లో శేష్ రక్తపు మరకల బట్టలతో, చేతులకు బేడీలతో ఉండి సిగరెట్ వెలిగిస్తూ ఊరమాస్ లుక్‌లో అదరగొడుతున్నాడు. భీమ్స్ సంగీతంలోని ‘రుబారు’ సాంగ్ ఇప్పటికే హిట్ కాగా, ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.