ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం: ఎమ్మెల్యే
KRNL: ఆదోని శివారులో ఉన్న ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే పార్థసారథి, సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ పరిశీలించారు. అక్రమంగా కంచెలు వేసి ఆక్రమించుకున్న సుమారు 75 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. వీటిని త్వరలోనే స్వాధీనం చేసుకుని, పరిశ్రమల ఏర్పాటుకు వినియోగిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ అవసరాల కోసం భూములను కాపాడతామని ఇవాళ రెవెన్యూ అధికారులు వెల్లడించారు.