నంద్యాలలో ‘వజ్ర ప్రహార్’ ఆపరేషన్
NDL: మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా జిల్లాలో ‘వజ్ర ప్రహార్’ ఆపరేషన్ శనివారం నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్ సబ్‌డివిజన్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.