జైల్‌లో ముగిసిన 6వ వార్షిక క్రీడా సాంస్కృతిక వేడుకలు

HYD: చర్లపల్లి సెంట్రల్ జైలులో రాష్ట్రస్థాయి ఖైదీల ఆరవ వార్షిక క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల వేడుకలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, ఐజీలు రాజేశ్, మురళి, డీఐజీలు సంపత్, సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, ఇతరులు పాల్గొన్నారు.