స్వామివారి సేవలో మాజీ ఉప రాష్ట్రపతి కుమార్తె
CTR: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ దీప వెంకట్ దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.