పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

MDK: గ్రామపంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ పని విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు డిమాండ్ చేశారు. చిలిపి చేడ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో ప్రశాంత్‌కు పంచాయతీ కార్మికుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గ్రామాల పరిశుభ్రతకు పాటుపడుతున్న పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.