సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే
ATP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఘనస్వాగతం పలికారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎంకు ఆమె పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎంతో పాటు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.